ఉచిత దర్శనం కోసం మొత్తం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతుంది. ₹300 శీఘ్రదర్శనానికి సుమారు 3 గంటల సమయం అవసరం కాగా, సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల లోపే దర్శనం లభిస్తుంది. నిన్న స్వామివారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 67,121 కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,426. అదే రోజు స్వామివారి హుండీ ఆదాయం ₹4.75 కోట్లుగా నమోదైంది.




















