ఈరోజు (04-03-2026)
వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. తెలివిగా ఆలోచించి కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనోధైర్యం మీకు బలంగా నిలుస్తుంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభప్రదం.
ఈవారం (01-03-2026 – 07-03-2026)
మీరు చేసే ప్రతీ ప్రయత్నం సఫలం కావడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. సరైన ప్రణాళికతో, మంచి ఆలోచనలతో ముందుకు సాగితే వృత్తిలో గొప్ప గుర్తింపును పొందుతారు. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఉద్యోగంలో మీ స్థాయిని, గౌరవాన్ని పెంచుతాయి. మొహమాటానికి పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా, మీ ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరిస్తే ఆర్థికంగా బలోపేతం కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో గడిపే సమయం మీకు ఎంతో ఉల్లాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి, పట్టుదలతో చేసే కృషికి అద్భుతమైన విజయాలు మీ సొంతం అవుతాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.




















