ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం -19వ అధ్యాయము – చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ

November 9, 2025
in Devotional News
0
KARTHIKA PURANAM
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి “ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి “జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము” అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు “ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు” అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు “ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నీధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు.” అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళించెను.
వశిష్టుడు జనకమహారాజుతో “రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీ మన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి
ఏకోనవింశోధ్యాయము – సమాప్తము

ShareTweetSend
Previous Post

శాంసంగ్‌ ఫోన్లను వాట్సాప్‌ ఫొటోల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్న ప్రయత్నాలు

Next Post

కార్తీకపురాణం 20 వ అధ్యాయము

Related Posts

పంచాంగం: 23 జూన్ 2026 (మంగళవారం)
Rasi Phalalu

పంచాంగం: 23 జూన్ 2026 (మంగళవారం)

June 23, 2026
తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు
Devotional News

తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు

June 22, 2026
శివపరా – అమ్మవారి అద్భుత నామం…!
Devotional News

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

June 22, 2026
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం
Devotional News

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

June 22, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు
Devotional News

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

June 22, 2026
దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత
Devotional News

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

June 20, 2026
Next Post
కార్తీకపురాణం 20 వ అధ్యాయము

కార్తీకపురాణం 20 వ అధ్యాయము

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 23, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

June 23, 2026
చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

June 23, 2026
డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

June 23, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం… భార్యా పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో విషాదం… భార్యా పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

June 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

జ్వరం సమయంలో చికెన్ తినడం మంచిదేనా? నిజాలు ఇవే

June 23, 2026
చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

చెవి గులిమి రంగు ఏం సూచిస్తుంది? ఆరోగ్య సంకేతాలు తెలుసా?

June 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.