అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న ఘటనపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల అదే పార్టీకి చెందిన పురుష ఎమ్మెల్యేలు అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీతక్క విడుదల చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీలు అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న సమయంలో వెనక నుంచి కొందరు ఎమ్మెల్యేలు వారిని నెట్టుకుంటూ ముందుకు వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోందని సీతక్క తెలిపారు. ముఖ్యంగా గంగుల కమలాకర్, సుధీర్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను వెనక నుంచి తోసినట్లు ఆమె ఆరోపించారు.
ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎందుకు రావాల్సి వచ్చిందని సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. కోవా లక్ష్మీ, సబితా ఇంద్రారెడ్డిల పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే అనుచితంగా వ్యవహరించారని విమర్శించారు.
నవీన్‌రెడ్డి నెట్టుకుంటూ వెళ్లిన సమయంలో మహిళా ఎమ్మెల్యేలు ఇబ్బందితో ‘అయ్యో’ అంటూ అరిచారని సీతక్క పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేలను వెనక నుంచి తోసిన ఘటనను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. గంగుల కమలాకర్, సుధీర్‌రెడ్డిల వ్యవహారాన్ని కీచకపర్వంగా అభివర్ణిస్తూ మండిపడ్డారు.
అసెంబ్లీ వంటి ప్రజాస్వామ్య వేదిక వద్ద ప్రజాప్రతినిధులు మర్యాద, బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని సీతక్క అన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















