ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణము 5వ అధ్యాయము – వనభోజన మహిమ

October 26, 2025
in Devotional News
0
5 adhyayam
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని, విష్ణ్యాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తియగును.  ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించ వలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుక్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును.

వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను – యని వశిష్ఠులవారు చెప్పిరి. అది విని జనకరాజు “మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను? దానికి గల కారణమేమి” యని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షము నొందుట:

 రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనా డతని తండ్రి కుమారుని పిలిచి “బిడ్డా! నీ దురాచారముల కంతులేకుండా వున్నది.

నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినయెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తికూడా కలుగును.

కాన,నీవు అటులచేయు” మని బోధించెను. అంతట కుమారుడు ‘తండ్రీ! స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమేకాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిదికాదా?’ అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రీ “ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావిచెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక” అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి “తండ్రీ! క్షమింపుము. అజ్ఞానంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని.

ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మెప్పు డే విధముగా కలుగునో దానికితగు తరుణోపాయమేమో వివరింపు” మని ప్రాధేయపడెను. అంతట తండ్రి “బిడ్డా! నాశాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీ వెప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు” అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపముపొంది అడవికిపోయి, ఒక చెట్టుతొఱ్ఱలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీతీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములో నొకరోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీనదిలో స్నానార్థమై బయలుదేరారు.

అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికమువున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరిదగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టుమొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరిజాడ తెలుసుకొని, ‘వీరు బాటసారులైవుందురు. వీరివద్దనున్నధన మపహరించవచ్చు ‘ ననెడు దుర్భుద్ధితో వారికడకు వచ్చిచూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి ” మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నామనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది. గాన, వివరింపుడు” అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు “ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీకపురాణము పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము” అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురణశ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమ్మునకై చెట్టుమొదట దాగివుండి పురాణమంతయు వినుచుండిన యెలుకకూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది “మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపమునుండి విముక్తుడనైతి” నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.

కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ యధ్యాయము పారాయణము సమాప్తము.

ShareTweetSend
Previous Post

ఇండియా vs ఆస్ట్రేలియా: రోహిత్-కోహ్లీ సంయుక్త జట్టు ధాటికి భారత్ ఘన విజయం – మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలుపు

Next Post

మొంథా తుపానుపై ఏపీ ప్రభుత్వం అలర్ట్‌ – కోస్తా జిల్లాల యంత్రాంగం సిద్ధం

Related Posts

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
Devotional News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
పంచాంగం: 25 జులై 2026 (శనివారం)
Rasi Phalalu

పంచాంగం: 25 జులై 2026 (శనివారం)

July 25, 2026
పూరీలో జగన్నాథుడి బహుడా యాత్ర.. భక్తజన సంద్రంగా మారిన పూరీ
Devotional News

పూరీలో జగన్నాథుడి బహుడా యాత్ర.. భక్తజన సంద్రంగా మారిన పూరీ

July 24, 2026
తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్
Devotional News

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

July 23, 2026
రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుడి విగ్రహం
Devotional News

రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుడి విగ్రహం

July 17, 2026
తిరుమల తొలి గడప దేవుని కడప చరిత్ర
Devotional News

తిరుమల తొలి గడప దేవుని కడప చరిత్ర

July 17, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026
కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

July 25, 2026

Recent News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026
కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

July 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.