రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, రక్షణ మరియు సామాజిక భద్రత కల్పించేందుకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గురువారం సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, కార్మిక సంఘాలతో ఆయన సమీక్ష నిర్వహించారు.
‘‘గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈనెల 12న మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడతాం. సభ్యుల ఆమోదం పొందిన వెంటనే చట్టాన్ని అమలు చేసి గిగ్ వర్కర్లకు రక్షణ కల్పిస్తాం. కార్మికుల కోసం బిల్లులో ఏవైనా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం దానిని పరిశీలిస్తుంది. చట్టంలో గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు ఎలా ఇవ్వాలో సమీక్షిస్తున్నాం. ఈ విషయమై అగ్రిగేటర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చట్టం అమలులోకి రాక తర్వాత కూడా మార్పులు అవసరమైతే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం’’ అని వివేక్ తెలిపారు.




















