మంత్రుల నుంచి ముఖ్య వ్యాఖ్యలు: దేవతల రాజధాని, రైతుల త్యాగభూమి ‘అమరావతి’ అని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శుక్రవారం అమరావతిలో 15 బ్యాంకుల కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో లోకేశ్ మాట్లాడుతూ:
‘‘గత వైకాపా ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేయాలని ప్రయత్నించింది. మూడు రాజధానులను చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఒక వ్యక్తి నివాసానికి రూ.700 కోట్లు ఖర్చు చేసి విశాఖలో ప్యాలెస్ కట్టారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ‘జై అమరావతి’ నినాదంతో ముందుకెళ్లాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని మనం పోరాటం చేశాం. జై అమరావతి నినాదం చెప్పినందుకు రైతులపై కేసులు పెట్టారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం సాగింది. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు, సుమారుగా 3 వేల మంది రైతులపై కేసులు నమోదయ్యాయి.
రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు సమర్పించారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి పేరు నిర్మలా సీతారామన్. ఆమె పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులకు సరైన సమాధానాలు చెబుతారు. వరుసగా 8 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఆమె జీవితం మనకు ఒక పాఠం.’’



















