వినియోగదారుల చెల్లింపుల అనుభూతిని మరింత సులభతరం చేసేందుకు, వన్97 కమ్యూనికేషన్స్ పేటీఎం యాప్‌ను పూర్తిగా నవీకరించిందని తెలిపింది. రోజువారీ లావాదేవీలను సులభతరం చేయడానికి, కృత్రిమ మేధ సామర్థ్యాలను యాప్‌లో జోడించారు. కొత్త వెర్షన్‌లో 15కు పైగా సౌకర్యాలను చేర్చారు. 12 దేశాల్లోని ప్రవాస భారతీయులు సహా దేశవ్యాప్తంగా వినియోగదారులు తమ చెల్లింపులను వేగంగా, సులభంగా నిర్వహించవచ్చు.
ప్రతి చెల్లింపుపై డిజిటల్ గోల్డ్ రివార్డులు పొందే అవకాశం కూడా అందించింది. కృత్రిమ మేధా ఇంటెలిజెన్స్ వినియోగదారుల చెల్లింపు ధోరణులను అర్థం చేసుకోవడంలో, అలాగే విడిగా బ్యాంక్ ఖాతాలను నమోదు చేసుకునే అవసరాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. యూపీఐ అనుసంధానిత ఖాతాల మొత్తం నిల్వ వివరాలను వేగంగా చూసుకోవచ్చు.
అదనంగా, మ్యాజిక్ పేస్ట్ ఫీచర్ ద్వారా వాట్సప్ మెసేజ్‌లు లేదా ఫేవరెట్ కాంటాక్టుల జాబితా నుంచి బ్యాంక్ ఖాతా, ఐఎఫ్‌ఎస్‌ఐ వివరాలను ఆటోమేటిక్‌గా నింపుకుని చెల్లింపులు వేగంగా చేయవచ్చని పేటీఎం వెల్లడించింది.




















