తిరుమలలో తెల్లవారుజామున భారీగాపొగమంచు కమ్ముకుని ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఆకట్టుకునే ఈ ప్రకృతి సౌందర్యాన్ని భక్తులు తమ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్న పిల్లలు వణుకుతున్నారు.
తిరుమల సమాచారం 🚩03-12-2025
🚩తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
🚩 ఉచిత దర్శనం కోసం 04 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు
🚩సర్వదర్శనం భక్తులకు 06 గంటల సమయం పడుతుంది
🚩300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది
🚩సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతుంది
🚩 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,684
🚩నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 20,515
🚩 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.75 కోట్లు



















