మార్టూరు: బాపట్ల జిల్లా పర్చూరులో మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారీ వర్షాలు మరియు వరదల కారణంగా పర్చూరులోని ఒక ప్రార్థనామందిరంలో 20 మంది ప్రజలు చిక్కుకున్నారని తెలుస్తుంది. వారిని పోలీసులు తక్షణమే సురక్షితంగా రక్షించారు.
ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని వై జంక్షన్ వద్ద పొక్లెయిన్ల సహాయంతో హైవే రోడ్డును పగులగొట్టి పక్కపోల్లోని పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఉప్పుటూరు ప్రాంతంలో కూడా తహసీల్దార్ కార్యాలయ ప్రాంతంలో వరద నీరు చేరింది.
పర్చూరులో పరిస్థితులను కలెక్టర్ వినోద్ కుమార్ స్వయంగా పరిశీలించారు. అలాగే, కారంచేడు వైపు నుండి పర్చూరుకు వచ్చే వాహనాలను పోలీసులు ఆపివేసి, ప్రజల భద్రతకు చర్యలు తీసుకున్నారు.



















