నగరంలోని భారత రాష్ట్ర సమితి నేతల నివాసాలపై ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. మోతీనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటి వద్ద, రెహమత్ నగర్‌లోని ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసంలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బు నిల్వ చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు జరిపారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నారు.




















