విశాఖ: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా రైల్వే శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రైళ్ల రాకపోకలపై అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు మరియు రేపు మొత్తం 43 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
విశాఖపట్నం మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా, కొన్ని రైళ్ల మార్గాలను మార్చినట్లు తెలిపారు. ప్రయాణికులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అన్ని జాగ్రత్త చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.




















