అరేబియా సముద్రం నుంచి తెలంగాణ దిశగా తేమగాలులు ప్రవహిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తేమగాలులు మరియు అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.




















