బెంగళూరు (మల్లేశ్వరం):
చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్ ఉన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ, “మరణశిక్ష విధించినా సమ్మతమే” అని పేర్కొన్నారు.
న్యాయవాది వివరాల ప్రకారం, దర్శన్‌కు జైలులో ఖైదీలకు ఇవ్వవలసిన కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పటివరకు 20 సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు. దర్శన్ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నప్పటికీ, అవసరమైన వైద్యం అందడం లేదని కూడా వివరించారు.
అలాగే, “విచారణను త్వరగా పూర్తి చేసి, తగిన శిక్షను అనుభవించేందుకు దర్శన్ సిద్ధంగా ఉన్నాడు” అని సునీల్ తెలిపారు. గతంలో దర్శన్ చేసిన “తనకు సైనేడ్ ఇస్తే తిని ఆత్మహత్య చేసుకుంటాను” అనే వ్యాఖ్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసి, తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.




















