పదవీ విరమణ తర్వాత రెగ్యులర్ ఆదాయం అందకపోవడం కారణంగా, ముందే సరైన ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. ప్రతి వ్యక్తి జీవితంలో రిటైర్మెంట్ నిధిని ఏర్పరచుకోవడం ఒక కీలక ఆర్థిక లక్ష్యంగా ఉండాలి. అయితే, ఈ నిధిని సమకూర్చుకునేందుకు సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడం కూడా సమానంగా ముఖ్యమని చెప్పాలి. ఒత్తిడి లేని రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలనుకుంటే, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆలోచించడం అవసరం. అందుకు కొంతమంది ప్రాథమిక పెట్టుబడి ఎంపికలను పరిశీలిస్తారు, వాటిలో ముఖ్యమైనవి: ఎన్‌పీఎస్ (NPS), పీపీఎఫ్ (PPF), మరియు మ్యూచువల్ ఫండ్ సిప్ . వీటిపై సమగ్ర అవగాహన వాటి మధ్య తేడాలు మరియు పోలికలు తెలుసుకోవడం ఎంతో అవసరం.




















