ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి బయలుదేరిన భక్తుల బృందం జౌన్‌పుర్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.
గాయపడిన వారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, బ్రాహ్మణతర్ల, పలాస ప్రాంతాలకు చెందినవారని గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులతో ఫోన్‌లో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. జౌన్‌పుర్ జిల్లా కలెక్టర్, వారణాసి విమానాశ్రయ అధికారులు, వైద్యులతో సమన్వయం సాధించి అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు.
ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




















