దళపతి విజయ్ తన 69వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో బలమైన రాజకీయ సందేశంతో వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ‘బీస్ట్’ తర్వాత విజయ్-పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవగా, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో ‘జన నాయకుడు’ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.




















