అమరావతి: రాష్ట్ర అగ్నిమాపక శాఖకు నూతన జవసత్వాలు సమకూరనున్నాయి. ఈ సేవల ఆధునికీకరణ, విస్తరణకు రూ.252.86 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సోమవారం పరిపాలన అనుమతులు ఇచ్చింది. 17 చోట్ల కొత్తగా అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మరో 36 చోట్ల ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక కేంద్రాల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. అమరావతిలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. ఈ మేరకు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పంపిన ప్రతిపాదనలకు అనుమతులిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా ఏర్పాటు కానున్న అగ్నిమాపక కేంద్రాలివే..
1. నాతవలస (విజయనగరం జిల్లా),
2. మధురవాడ,
3. మహారాణిపేట,
4. సింహాచలం (విశాఖపట్నం),
5. చింతూరు,
6. అరకు (అల్లూరి సీతారామరాజు),
7.రాజమహేంద్రవరం రూరల్-బొమ్మూరు (తూర్పుగోదావరి),
8. ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్),
9.ఏపీ హైకోర్టు వద్ద- నేలపాడు (గుంటూరు),
10.అద్దంకి (బాపట్ల),
11. బుచ్చిరెడ్డిపాళెం(నెల్లూరు),
12. కల్యాణదుర్గం (అనంతపురం),
13. తిరుపతి రూరల్ (తిరుపతి),
14. ముద్దనూరు (కడప),
15. నందికొట్కూరు (నంద్యాల),
16. ములకలచెరువు (అన్నమయ్య),
17. పొదిలి (ప్రకాశం).




















