పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా సందర్శించారు. పత్తి, మిర్చి పంటలు భారీగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రత్తిపాటి మాట్లాడుతూ – “తుఫాన్ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనందరికీ బాధాకరం. పంట నష్టం అంచనాలు వేస్తున్నాం. ప్రతి రైతు బాధను గుర్తించి వారికి అండగా నిలుస్తాం” అన్నారు.
తుఫాన్ దెబ్బతో చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో పంటలు నీటమునిగిపోయి, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పర్యటన రైతుల్లో కొంత భరోసా నింపింది.




















