ఫేషియల్ అంటే చాలామందికి పార్లర్‌నే గుర్తుకు వస్తుంది. కానీ నిపుణుల ప్రకారం, ఇంట్లో లభించే పదార్థాలు, పండ్లతో స్వయంగా ఫేషియల్ చేసి కూడా చర్మాన్ని అందంగా మెరిసిపెట్టుకోవచ్చు. అలాంటిదే బొప్పాయితో చేసుకునే ఫేషియల్!
మసాజ్ విధానం:
బాగా పండిన బొప్పాయిని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ గుజ్జును ముఖానికి, మెడకు పూసి, సుమారు 30 నిమిషాల పాటు గుండ్రంగా మర్దన చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. కోరుకుంటే, బొప్పాయి పేస్ట్‌కి ఒక టీస్పూన్ కలబంద గుజ్జు లేదా తేనె కలుపుకోవచ్చు.
చర్మానికి లాభాలు:
బొప్పాయితో చేసే ఫేషియల్ గోల్డెన్ ఫేషియల్ తరహా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ముఖంలో ఉన్న ట్యాన్ కూడా తగ్గుతుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ఫేషియల్ చేస్తే ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




















