చౌటుప్పల్ గ్రామీణం, సాధారణంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే టోల్ రుసుము రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. ఇంతవరకు, నగదు లేదా యూపీఐ ద్వారా చెల్లించినా ఇది వర్తించేది.
కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సడలించింది. యూపీఐ ద్వారా చెల్లిస్తే టోల్ రుసుముకు కేవలం 25% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన నవంబరు 15 (శుక్రవారం తెల్లవారుజాము) నుండి అమల్లోకి రానుంది.
ఉదాహరణకు: ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు రూ.100 టోల్ రుసుము చెల్లిస్తే, ఫాస్టాగ్ లేని వారు నగదు ద్వారా అయితే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ.125 మాత్రమే చెల్లించాలి.
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ మార్పును అనుసరించి టోల్‌ప్లాజా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు తెలిపారు.




















