భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణలు జరగనున్నాయి. మొదట పిటిషనర్లను, అనంతరం ప్రతివాదులను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. రోజుకు ఇద్దరిని చొప్పున విచారణ చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. మొదటగా ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నారు.




















