శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌ను బుధవారం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు తాకాయి. ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి.. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సమయంలో ఆకాశంలో మబ్బులు లేకుండా నిర్మలంగా ఉండే సమయంలో సూర్యకిరణాలు ఆదిత్యుని మూలవిరాట్‌ను తాకుతాయి. గత రెండేళ్లుగా మబ్బుల కారణంగా కిరణ స్పర్శ దర్శనం భక్తులకు కలగలేదు. బుధవారం భానుడి లేలేత కిరణాలు ఆలయ గోపురం మధ్య నుంచి అనివెట్టి మండపం మీదుగా ధ్వజస్తంభం పక్కగా అంతరాలయంలోకి చేరి స్వామివారి శిరస్సును తాకాయి – శ్రీకాకుళం నగరం



















