తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలు దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ద్వారా డిసెంబర్ 19 నుంచి 21 వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇందుకు రూ.30 లక్షల నిధులు విడుదల చేసినట్లు కూడా చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జీవో విడుదల చేసింది.




















