సృజనాత్మకతకు భక్తిని జోడించి వివిధ రకాల పప్పులు, మసాలా దినుసులతో ఇలా అమ్మవారిని సాక్షాత్కరింపజేశారు. దసరా వేడుకల సందర్భంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత 15 గంటలపాటు శ్రమించి ఈ రూపాన్ని తీర్చిదిద్దారు. బాదంపప్పు, జీడిపప్పు, పెసలు, మినుములు, లవంగాలు.. ఇలా దాదాపు 20 రకాల దినుసులను ఉపయోగించారు.

















