కర్నూలులో బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు, ముఖ్యంగా ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించిన 289 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు, 18 బస్సులను సీజ్ చేశారు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం వంటి కారణాలతో ప్రైవేట్ బస్సులకు భారీ జరిమానాలు విధించారు. మొత్తంగా ప్రైవేట్ బస్సులపై ₹7.08 లక్షల జరిమానా విధించబడింది.
ప్రాంతాల వారీగా వివరాలు:
- ఏలూరు: 55 కేసులు, 3 బస్సులు సీజ్
- తూ.గో.: 17 కేసులు, 4 బస్సులు సీజ్
- కోనసీమ: 27 కేసులు
- చిత్తూరు: 22 కేసులు
- కర్నూలు: 12 కేసులు
- విశాఖ: 7 కేసులు
- నంద్యాలలో: 4 కేసులు
తనిఖీలలో ముఖ్యంగా:
- సరైన ధ్రువపత్రాలు లేని బస్సులు: 8
- అత్యవసర ద్వారం లేని బస్సులు: 13
- ఫైర్ పరికరాలు లేని బస్సులు: 103
- ప్యాసింజర్ లిస్ట్ లేని బస్సులు: 34
- ఇతర ఉల్లంఘనలపై: 127 బస్సులు
రవాణా శాఖ అధికారులు తెలిపారు, ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రతి రోజూ కొనసాగుతుంది, ప్రజల భద్రతకు అన్ని చర్యలు కొనసాగిస్తూ ఉంటాయని.


















