గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని అడగగా, ఆమె సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తుఫాను వల్ల తమ పంటలకు ఎటువంటి నష్టం జరగలేదని మహిళా రైతు స్పష్టంగా తెలిపింది. అంతేకాకుండా, ఎకరానికి రూ.15 వేల వరకు ఆదాయం వస్తోందని గర్వంగా చెప్పింది.
మహిళా రైతు సమాధానంతో కాసు మహేష్‌రెడ్డి కొంత అసహజంగా మారి, అక్కడి పరిస్థితి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా చర్చలు జోరుగా సాగుతున్నాయి.



















