రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఆ పునరారంభానికి ప్రతీకగా సీఆర్డీఏ కొత్త కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) ఉదయం 9.54 గంటలకు భూములు ఇచ్చిన రైతుల సమక్షంలో ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య భవన ద్వారాలను సీఎం తెరిచి శుభారంభం చేశారు.
ఈ సందర్భంగా పండితులు పూర్ణకుంభ స్వాగతంతో ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అనంతరం భవనాన్ని పరిశీలించిన సీఎం, నిర్మాణ తీరుపై మంత్రి నారాయణ నుంచి వివరాలు తెలుసుకున్నారు. అమరావతిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనంగా సీఆర్డీఏ ఆఫీస్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.




















