రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ (Land Pooling) ప్రక్రియలో బుధవారం ఒక్కరోజే రైతులు మొత్తం 100.885 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకి అప్పగించి ఒప్పందాలు చేసుకున్నారు. తుళ్లూరు, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి గ్రామాలకు చెందిన 12 మంది రైతులు స్వచ్ఛందంగా రాయపూడిలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి అదనపు కమిషనర్ భార్గవతేజ ఆధ్వర్యంలో అధికారులకు సంబంధిత పత్రాలు అందజేశారు.
ఈ ప్రక్రియలో తుళ్లూరు రైతులు 9.76 ఎకరాలు, రాయపూడి రైతులు 31.005 ఎకరాలు, లింగాయపాలెం రైతులు 16.90 ఎకరాలు, వెలగపూడి రైతులు 43.22 ఎకరాలు భూమిని అందజేశారు. మొత్తం 100.885 ఎకరాలు ఒకే రోజులో భూసమీకరణలో భాగంగా సేకరించడం గమనార్హం.
వెలగపూడికి చెందిన కారుమంచి రంగారావు కుటుంబ సభ్యులు సుమారు 60 ఎకరాలు, తుళ్లూరుకు చెందిన గద్దె సత్యనారాయణ కుటుంబ సభ్యులు 16 ఎకరాలు భూమిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రైతుల సహకారంతో రాజధాని అభివృద్ధి పనులకు ఉన్న కొన్ని అడ్డంకులు తొలగినట్లు భావిస్తున్నారు.
గురువారం కూడా మరికొందరు రైతులు ముందుకు వచ్చి భూములు అప్పగించనున్నారని సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















