కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం రాజస్థాన్‌లోని కోటాలో నిర్వహించిన “ఛాత్రోంకీ గూంజ్” (విద్యార్థుల ప్రతిధ్వని) మహార్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశ విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఒత్తిడికి, పీడనకు గురిచేస్తూ వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. “ఇది దేశానికి మంచిది కాదు. విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహలు పెరగకుండా ఉండే వ్యవస్థ కోసం మనందరం కలిసి పనిచేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
ఇది రాజకీయ సభ కాదని, విద్యార్థుల సమస్యలు, వారి భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన వేదిక అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
సభ అనంతరం రాహుల్ గాంధీ వేదికపైకి ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను పిలిచి వారి అనుభవాలను తెలుసుకున్నారు. కోటాలో జరుగుతున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమావేశాల పరంపరలో మొదటిదని కాంగ్రెస్ పేర్కొంది.
నీట్, జేఈఈ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 1.2 లక్షల మంది విద్యార్థులు కోటాలోని వివిధ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలు, కోచింగ్ ఖర్చుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















