వైకాపా నేత, మాజీ మంత్రి Gudivada Amarnath తన తాజా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలోని వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తనపై కొద్ది రోజులుగా తెదేపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో వైఎస్ విజయమ్మ, భారతి గురించి రాష్ట్ర హోంమంత్రి అనిత చేసిన సంస్కారహీనమైన వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మూడు తరాల రాజకీయ నేపథ్యం ఉన్న తనకు అసభ్యంగా మాట్లాడే అవసరం లేదని, తాను ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రిగా తనకు గౌరవం ఇవ్వకుండా “వాడెవడు” అని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
తన వ్యాఖ్యలపై పోలీసు కేసులు పెట్టినా భయపడబోనని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలకు తాను వెనకడుగు వేయనని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















