ఆస్ట్రేలియా (సిడ్నీ): గ్రేటర్ సిడ్నీలోని ప్రధాన నగరాల్లో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారమట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో పారమట్టాలో స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా గ్లోబల్ సిటీగా రూపాంతరం చేసేందుకు జైటర్ చూపిన కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. ప్రజారవాణా, గ్రీన్ స్పేస్‌ల అభివృద్ధిలో ఆయన చేసిన చొరవ, అలాగే పారమట్టా స్క్వేర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించడం ప్రత్యేకంగా గుర్తించబడింది.
గత 20 సంవత్సరాలుగా లోకల్ గవర్నెన్స్ మరియు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న జైటర్, సార్టప్ స్టేట్‌గా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ అభ్యర్థించారు.
భేటీ అనంతరం, హారిస్ పార్కులో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్‌సైడ్ ఫుడ్ కోర్టును మంత్రి లోకేష్ సందర్శించారు.






















