ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మంత్రి నారా లోకేష్, గోల్డ్ కోస్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.
గోల్డ్ కోస్ట్ విమానాశ్రయంలో లోకేష్ రాక సందర్భంగా ప్రవాసాంధ్రులు పూలమాలలతో, నినాదాలతో ఆయనకు ఆహ్వానం తెలిపారు. తరువాత వారు మంత్రి లోకేష్‌తో ఆప్యాయంగా ముచ్చటించి, సెల్ఫీలు మరియు గ్రూప్ ఫోటోలు దిగారు.
ప్రవాసాంధ్రుల సత్సంకల్పం, అభినందనలు పట్ల లోకేష్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ప్రవాసుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గోల్డ్ కోస్ట్‌లోని పలు వ్యాపార మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఆయనకు లభించనుంది.


























