చిలకలూరిపేట: పట్టణంలో పోలీసులు విస్తృత స్థాయిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, సీఐ, ఎస్సైలు సహా సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల సమయంలో సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ ఆధారాలు లేని 95కి పైగా బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, నివాస గృహాల్లో ఉన్న వారి వివరాలను సేకరించి, నలుగురు అనుమానితులను గుర్తించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు, మారణాయుధాల వినియోగం లేదా మత్తుపదార్థాల స్మగ్లింగ్ వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణా జరిపే వారిపై కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.



















