ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆర్థిక, భూసంబంధ సహాయం అందించింది. ఈ మేరకు మంత్రి నారాయణ కుటుంబసభ్యులకు చెక్కులు మరియు భూసంబంధ పరిహారాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, లక్ష్మీనాయుడు భార్యకు 2 ఎకరాల భూమి మరియు రూ.5 లక్షల నగదు పరిహారం ఇవ్వబడింది. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల భూమి మరియు రూ.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఏర్పాటు చేయబడింది. అలాగే, లక్ష్మీనాయుడు పిల్లల చదువుకు ప్రభుత్వం భాధ్యత తీసుకుంది.
గాయపడ్డ పవన్ మరియు భార్గవ్‌కు కూడా పరిహారం అందించబడింది. పవన్‌కు 4 ఎకరాల భూమి మరియు రూ.5 లక్షల పరిహారం, భార్గవ్‌కు రూ.3 లక్షల పరిహారం ఇచ్చారు.
కేసును వేగంగా, సమర్థవంతంగా దర్యాప్తు చేయడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. లక్ష్మీనాయుడు హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ తెలిపారు.




















