వధూవరుల ఫొటోషూట్లు ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయాయి. పెళ్లి ఫొటోషూట్ అంటేనే ఓ ప్రత్యేక ఫీల్! కొండలు, నీరు, పచ్చని చెట్ల మధ్య వధూవరులు పోజులు ఇస్తుంటే, ఆ సన్నివేశాలన్నీ స్వర్గాన్ని తలపిస్తాయి. అలాంటిదే ఒక ఫొటోషూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ జంట అందమైన ప్రకృతి మధ్య ఫొటోషూట్ చేస్తున్నప్పుడు కెమెరామెన్ అనేక యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో, వరుడు వధువుకు నుదిటిపై ముద్దు పెట్టే సీన్ తీయాల్సి వస్తుంది. అందుకే కెమెరామెన్ వరుడికి “నుదుటిపై కిస్ ఇవ్వండి” అని చెప్పాడు.
వరుడు కూడా అలాగే చేశాడు కానీ ఆ తర్వాత కాస్త తడబడిపోయాడు. కెమెరామెన్ వైపు చూస్తూ, “ఇలా చేస్తే అందరికీ అసౌకర్యంగా ఉండదా?” అని అడిగాడు. దానికి కెమెరామెన్ నవ్వుతూ, “మీకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా చేయండి” అన్నాడు. అలా అన్న వెంటనే వరుడు… ఏకంగా వధువుకు లిప్‌టు లిప్ కిస్ ఇచ్చేశాడు!
ఈ సీన్ చూసిన కెమెరామెన్ షాక్ అయిపోయాడు. పక్కనే ఉన్నవారు కూడా అవాక్కయ్యారు. ఎవరో పక్కనుండి ఈ సన్నివేశాన్ని వీడియో తీశారు. చూస్తుంటే నవ్వు ఆపుకోలేని సీన్‌లాగా ఉంది కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో భలే వైరల్ అవుతోంది.
నెటిజన్లు కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు —
“చివరికి కెమెరామెన్‌కే అసౌకర్యం కలిగిందిగా!” అని కొందరు,
“ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా!” అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోకు 1.33 లక్షలకుపైగా లైక్‌లు, 4.4 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. నవ్వులు పంచుతూ సోషల్ మీడియాలో ఈ జంట వీడియో దుమ్మురేపుతోంది.



















