కార్యకలాపాల పరమైన సమస్యల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ తమ దూరప్రాంత విమానాల షెడ్యూల్‌లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి తదుపరి నోటీసులు జారీ చేసే వరకు డెన్మార్క్ రాజధాని కోపన్‌హేగన్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.అలాగే ఈ నెల 7వ తేదీ నుంచి దిల్లీ–మాంచెస్టర్, 9వ తేదీ నుంచి దిల్లీ–లండన్ హీత్రూ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించనున్నట్లు ఇండిగో తెలిపింది. భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా గగనతల ఆంక్షలు తరచూ మారుతుండటంతో పాటు, భారత్ సహా విదేశీ విమానాశ్రయాల్లో రద్దీ పెరగడం వల్ల విమాన ప్రయాణ సమయం ఎక్కువవుతోందని సంస్థ పేర్కొంది.
దీని ప్రభావంతో ఇండిగోకు చెందిన వైడ్ బాడీ విమానాల (787‑9) షెడ్యూల్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. వాస్తవానికి ఈ మార్పులను వేసవి షెడ్యూల్‌లో అమలు చేయాలని భావించినప్పటికీ, మిగిలిన దూరప్రాంత విమానాల కార్యకలాపాలు సాఫీగా, స్థిరంగా కొనసాగేందుకు ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో వివరించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడడమే ఈ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది.
గతేడాది డిసెంబర్ తొలి వారంలో వేల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో వింటర్ షెడ్యూల్‌పై 10 శాతం కోత విధించింది. ఇటీవల సంస్థపై రూ.22 కోట్ల జరిమానా విధించడంతో పాటు రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















