బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ చదివిన యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఫార్మసీ చదివిన వారికి సొంత ఊరిలోనే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.జాతీయ పశువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం (National Animal Disease Control Programme) కింద ఈ పశు ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన పశువుల మందులను తక్కువ ధరల్లో రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, సహకార సమాఖ్యలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కనీసం 120 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. సొంత స్థలం లేదా అద్దెకు తీసుకున్న స్థలంలోనైనా ఈ కేంద్రాలు ప్రారంభించవచ్చు.ఈ కేంద్రాల నిర్వహణకు ఫార్మసిస్టులను నియమించాల్సి ఉంటుంది. అలాగే డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి అవసరమైన డ్రగ్ సేల్ లైసెన్స్, ఫార్మాసిస్ట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
పశు ఔషధి కేంద్రాలకు అవసరమైన మందుల సరఫరా, నాణ్యత పరీక్షలు, నిల్వ, నిర్వహణ వంటి బాధ్యతలను ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు, వెటర్నరీ చికిత్స ఖర్చులు తగ్గించి, లైవ్‌స్టాక్ ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసే వారికి ఆపరేటివ్ మార్జిన్ ఇన్సెంటివ్‌గా 20 శాతం అందించనున్నట్లు వెల్లడించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అర్హత, ఆసక్తి ఉన్నవారు https://pashuaushadhi.dahd.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని లేదా సమీప జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















