ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పెట్టుబడి రాబోతోందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. రెన్యూ పవర్ సంస్థ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ రెన్యూ పవర్ సంస్థ ఏపీకి అడుగుపెడుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో విస్తృత స్థాయిలో ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని లోకేశ్ పేర్కొన్నారు.
రూ.82 వేల కోట్లు పెట్టుబడికి రెన్యూ పవర్ సంస్థ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకుంది.
ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువ గల నాలుగు ఎంఓయూలు రెన్యూ పవర్ ప్రతినిధులు కుదుర్చుకున్నారు.
అంతేకాక, గతంలోనే రూ.22 వేల కోట్లు పెట్టుబడికి రెన్యూ పవర్ ముందుకు వచ్చింది.
సంస్థ పునరుత్పాదక శక్తి, సోలార్ ఉత్పత్తి, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది.
ఒప్పందంలో 6 GW PV ఇంగోట్-వేఫర్ ప్లాంట్, 2 GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 KTPA గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లో 5 GW హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్టు ఉంది.
తాజా ఎంఓయూల ద్వారా 10,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.
ఇప్పటికే, దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడానికి రెన్యూ పవర్ అంగీకరించింది.
గత ప్రభుత్వంలో రాష్ట్రం నుండి బయలుదేరిన కంపెనీలు తిరిగి భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయని మంత్రి లోకేష్ ఇటీవల ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రకారం, విశాఖలో నేడు సిఐఐ సమ్మిట్‌కు ముందు కుదిరిన ఒప్పందం జరిగింది.

























