పెదపాడు మండలంలోని అప్పనవీడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల సంరక్షణ చర్యలపై వ్యవసాయ డైరెక్టర్ సూచనలు చేశారు. రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని సూచించారు.
ఎరువుల పంపిణీ విధానంలో APAIMS యాప్ వినియోగం గురించి రైతులకు వివరించారు. ప్రతి రైతు ఈ యాప్‌ను ఉపయోగించాలని, ఎరువుల లభ్యతతో పాటు పంటల సాగు, వ్యవసాయ పథకాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని కూడా పొందవచ్చని తెలిపారు.
రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా, ఏడీఏ అనిలా కుమారి, పెదపాడు మండల వ్యవసాయ అధికారి వాసిం తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















