ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) రాష్ట్రస్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీసీఓబీ) నిర్వహించిన 63వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ సొసైటీ’ అవార్డును అందుకుంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులకు అవార్డును ప్రదానం చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాల పంపిణీ, రుణాల సమర్థవంతమైన వసూళ్లు, సభ్యులకు నాణ్యమైన సేవలు, పారదర్శక పాలన, మెరుగైన ఆర్థిక నిర్వహణ వంటి అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ అవార్డుకు ఆనందపురం పీఏసీఎస్ ఎంపికైంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మొత్తం 99 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రథమ స్థానాన్ని సాధించడం విశేషం.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పాండ్రంగి అప్పలరాజు మాట్లాడుతూ, బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే రాష్ట్రస్థాయి అవార్డు రావడం సంఘం సభ్యులు, సిబ్బంది, పాలకవర్గం కృషికి నిదర్శనమని అన్నారు. ఈ విజయానికి సహకరించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, సీఈఓ డీవీఎస్ వర్మ, డీజీఎం ఎం. అశోక్‌కుమార్, టి. ప్రవీణ, జాయింట్ రిజిస్ట్రార్ కిరణ్ కుమారి, బ్యాంకు అధికారులు, సంఘం సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















