ముఖంపై మొటిమల సమస్యకు ఇబ్బందిపడుతున్నారా? అయితే, ఈ హోం రిమిడీస్ ట్రై చేయండి.
శీతాకాలంలో మొటిమలు ఎక్కువగా రావచ్చు. మొటిమలకు కారణాలు వేరే వేరే కావచ్చు – కొందరికి పొడి చర్మం, మరికొందరికి జిడ్డు చర్మం, అలాగే ఆహారం, జీవనశైలి, ఒత్తిడి కూడా ప్రభావితం చేస్తాయి. ఇలా మొటిమలు వచ్చినప్పుడు ఈ చిట్కాలు ఉపయోగపడతాయి:
1. పసుపు పేస్ట్:
ముఖంపై మొటిమలు ఉంటే పసుపు పేస్ట్‌ని అప్లై చేయండి. పసుపులో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. పసుపును కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. కావాలంటే రోజ్ వాటర్ కూడా జోడించవచ్చు.
2. వేప, తులసి:
వేప మరియు తులసి క్రిమినాశక లక్షణాలు కలిగివున్నాయి. వీటిని పేస్ట్ గా తయారు చేసి ముఖానికి అప్లై చేసి 25 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఈ విధంగా ఏడు రోజులు చేస్తే మొటిమలు తగ్గి, ముఖం స్పష్టంగా కనిపిస్తుంది.
3. లవంగాలు:
లవంగాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి, కాబట్టి మొటిమలు, వాపులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. కొద్దిగా నీటితో కలిపి లవంగాల పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.
4. తేనె, దాల్చిన చెక్క:
తేనె, దాల్చిన చెక్క చర్మం మంట, నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి పేస్ట్ తయారు చేసి 15 నిమిషాలు ముఖంపై ఉంచి ఆపై నీటితో శుభ్రం చేయండి. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.




















