ఇంటర్నెట్ డెస్క్: ‘చిన్నారి పెళ్లికూతురు’గా విశేష గుర్తింపుపొందిన నటి అవికా గోర్ .. వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 30న తన ప్రియుడు మిళింద్ చద్వానీని వివాహమాడారు. ఈవిషయాన్ని తెలుపుతూ తాజాగా తన పెళ్లి ఫొటోలు పంచుకున్నారు. ‘బాలిక నుంచి వధువు వరకూ..’ అనే క్యాప్షన్‌తో అవికా కొన్ని పిక్స్ షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అవికాను పెళ్లాడిన వ్యక్తి పేరు మిళింద్ చద్వానీ. ఆయన సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త. క్యాంప్ డైరీస్ పేరిట ఓ ఎన్జీవోను నెలకొల్పారు. అంతకుముందు ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2019లో ఓ టీవీలో ప్రసారమైన ‘రోడీస్ రియల్ హీరోస్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొన్నాళ్లక్రితం మిళింద్, అవికా మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత స్నేహితులయ్యారు. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
‘ఉయ్యాలా జంపాలా’తో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన అవికా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. తర్వాత, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ ‘షణ్ముఖ’ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది.




















