ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో ను వరించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. అయితే ఈ అవార్డును అందుకునే విషయంలో మరియానా చిక్కులు ఎదురవుతున్నాయి. అజ్ఞాతంలో ఉన్న ఆమె నోబెల్ బహుమతి స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనెజువెలా అటార్నీ జనరల్ వెల్లడించారు. మరియాపై కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు, పలు కేసులు ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.




















