అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ మొత్తం 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు 32 శాతం మేర పెరిగాయి. మొత్తం 2606 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రోక్యూర్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులకు సౌకర్యం కల్పించేందుకు కొనుగోలు కేంద్రాల్లో 7.89 కోట్ల గోనె సంచులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోపే రూ. 4085 కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు వ్యవసాయ, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.



















