విభూతి కొండను ఆపెదెవరు? అని తాండవానికి సిద్ధమయ్యారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ ఈరోజు ప్రత్యేక ప్రదర్శనలతో ప్రారంభమవుతోంది. శుక్రవారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా బుధవారం రాత్రి ప్రత్యేక టీజర్‌ను రిలీజ్ చేశారు. “లోక క్షేమం కోరావు… ఇక నీ క్షేమం ఆ శివుడి అధీనం…” మరియు “కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు… త్రిశూలం పట్టుకున్న ఆ దైవాన్ని చూడు…” అనే సంభాషణలు, అలాగే బాలకృష్ణ చేసిన యాక్షన్ సన్నివేశాలు టీజర్ ఆకర్షణగా నిలిచాయి.చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. సంగీతం తమన్ సమకూర్చారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచడం, ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించడంపై అనుమతులు ఇచ్చాయి.తెలంగాణలో 11వ తేదీన జరగబోయే ప్రత్యేక ప్రదర్శనల్లో టికెట్ ధరలు జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్‌లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ ధరలు 12 నుంచి 14 వరకు అమల్లో ఉంటాయి. పెంచిన టికెట్ ఆదాయంలో 20% భాగం సినీ కార్మికుల సంక్షేమం కోసం మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు జమ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.ఏపీ లో సింగిల్ స్క్రీన్‌లలో జీఎస్టీతో కలిపి రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచేందుకు అనుమతులు ఉన్నాయి. ఈ ధరలు 12వ తేదీ నుంచి పది రోజులపాటు అమల్లో ఉంటాయి.




















