నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే చర్చనీయాంశంగా మారింది. దిల్లీ శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ఈ సినిమా విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ చిత్ర బృందానికి లేఖ రాశారు. సినిమా విడుదలకు ముందే తమకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని అంశాలపై అసంతృప్తి కలిగిందని అర్జున్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాల చిత్రీకరణ, నటీనటుల కాస్ట్యూమ్స్ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. రామాయణం కోట్లాది మంది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన కథ కావడంతో చిత్ర బృందం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
గతంలో ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ముందుగానే సినిమా ప్రదర్శన నిర్వహించాలని కోరారు. సినిమాలో హిందూ మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఉంటే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
తమ అభ్యర్థనను పట్టించుకోకుండా సినిమాలో అభ్యంతరకర అంశాలు ఉంటే థియేటర్ల వద్ద నిరసనలు చేపట్టాల్సి వస్తుందని అర్జున్ కుమార్ హెచ్చరించారు. మరోవైపు చిత్ర బృందం మాత్రం ఈ భారీ ప్రాజెక్టును రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తుండగా.. యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















