కథానాయిక రష్మిక మందన్నా తనకు తుంటికి అయిన గాయం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. వరుసగా మూడోసారి గాయపడటంతో ప్రస్తుతం షూటింగ్స్‌కు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. తన శరీరాన్ని ఇంతకాలం ఒక యంత్రంలా భావించి పనిచేశానని, ఇకపై మనిషి శరీరంలా చూసుకోవడం నేర్చుకోవాలని పేర్కొన్నారు.
‘మైసా’ సినిమా డ్యాన్స్ చిత్రీకరణ సమయంలో రష్మికకు తుంటికి గాయమైంది. వైద్యులను సంప్రదించగా తుంటిలోని స్నాయువుల్లో ఒకటి దెబ్బతిన్నట్లు గుర్తించారు. చికిత్స అనంతరం సుమారు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
తన గాయం గురించి మాట్లాడుతూ.. ఇది తాను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత కఠినమైనదని రష్మిక తెలిపారు. గాయాలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నొప్పి భరించలేనంతగా లేదని చెప్పారు. ఈ గాయాలన్నీ అనుకోకుండా జరిగినవేనని, తనకు బలవంతంగా వచ్చిన సెలవులుగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుతం వ్యాయామాలు చేయలేకపోతున్నానని, విశ్రాంతి సమయంలో పజిల్స్ చేస్తూ సమయం గడుపుతున్నానని రష్మిక తెలిపారు. తాను పజిల్స్‌ను ఇంత బాగా చేయగలనని తనకే తెలియదని సరదాగా చెప్పారు. అంతేకాకుండా ఈ విరామంలో స్వీట్లు ఎక్కువగా తింటున్నానంటూ అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















