బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్‌కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ‘జటాధర’ సుధీర్‌బాబు హీరోగా పాన్ ఇండియాలో స్థాయిలో వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించారు. నవంబరు 7న ఈ సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ‘ధన పిశాచి’ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీహర్ష రాసిన ఈ పాటను సాహితి చాగంటి పాడారు. సమీర కొప్పికర్ స్వరాలు సమకూర్చారు.




















