కోనసీమ జిల్లా :
మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా కోనసీమ జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. తుఫాన్ సమయంలో ప్రమాదాలు, సరఫరా అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావంతో తీగలు తెగిపడే అవకాశం ఉండటంతో, ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి గమనించిన వెంటనే విద్యుత్ సిబ్బందికి లేదా అత్యవసర నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తడిసిన స్తంభాలు, స్విచ్ బోర్డులు, తీగల వద్ద చెట్ల కొమ్మలు తాకరాదని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ముందస్తుగా తాగునీరు నిల్వ చేసుకోవాలని, జనరేటర్లు ఉన్నవారు డీజిల్, ఆయిల్ నిల్వ ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
అత్యవసర సమాచారం కోసం ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా కోనసీమ జిల్లా నియంత్రణ కేంద్ర నంబర్ 9440904477 ను సంప్రదించాలని విద్యుత్ శాఖ తెలిపింది.



















